సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులను ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న. మెగా డీఎస్సీపై (Mega DSC) ముఖ్యమంత్రి తాజగా కీలక ప్రకటన చేశారు. నేడు, మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఏప్రిల్ నెల మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను ప్రకటిస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. వేసవి సెలవుల తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలక పాత్ర అని గత వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని అందరం కలిసి గాడిలో పెట్టాలన్నారు. కలెక్టర్లు అంటే అధికార దర్పం ప్రదర్శించడం కాదని..ప్రజల సమస్యల పరిస్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదన్నారు. అయితే సంక్షేమం అమలు కోసం అప్పులు తెస్తే ఎంతకాలం కొనసాగిస్తామని ప్రశ్నించారు.అందుకే ప్రజల స్వయం ఉపాధి అభివృద్ధి వేగవంతం కావాలని అన్నారు.
