సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకూ కసరత్తు జరుగుతున్నా నేపథ్యంలో ప్రభుత్వసంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులు ప్రామాణికం కావడంతో లబ్ధిదారులు అందరు తమ కుటుంబ సభ్యుల కెవైసి పూర్తీ చేసుకోవలసి ఉంది. ఇదే సమయంలో రేషన్‌కార్డుదారులు ఈనెల 31వ తేదీలోపు ఈకెవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని అన్ని జిల్లాల లో ఇప్పటికే తహశీల్దార్లను ప్రభుత్వం ఆదేశించింది. తహశీల్దార్లు గ్రామ రెవెన్యూ, రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి ఈకేవైసీలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రభుత్వం వారి నుంచి వేలిముద్రలను, కంటి ఐరీస్ ద్వారా ఈకేవైసీని పూర్తిచేయాలని ఆదేశించింది. కార్డులోని ప్రతి సభ్యుడు సమీపంలోని రేషన్ డీలర్, వీఆర్వో, సచివాలయ సిబ్బంది లాగిన్లలో ఆధార్‌కార్డు చూ పించి వేలిముద్రలు లేదా ఐరిస్ ఇవ్వాల్సి ఉం ది. లేదంటే మార్చి 31 తరువాత వారి పేర్ల ను కార్డు నుంచి తొలగిస్తారని అధికారులు ఇప్పటికే పేర్కొంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయల్లో మొబైల్ యాప్, రేషన్‌ల్లోని ఈ పోస్ పరికరాల ద్వారా ఆప్‌డేట్ చేసుకోనేలా అధికారులు సౌకర్యం కల్పించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈకేవైసీ నుంచి మినహాయింపు నిచ్చారు.
