సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో బోగస్ రేషన్ రేషన్ కార్డు లబ్ధిదారులు ఏరివేతలో భాగంగా ఈకేవైసీ చేయించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటి సోమవారం మార్చి 31 తో ముగియనుండటం తో లబ్దిదారులకు మరో నెల రోజులు గడువు పెంచింది. ఇంకా కొందరు రేషన్ లబ్ధిదారులందరూ ఈకేవైసీ చేయించుకోక పోవడంతో ఏప్రిల్ నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ లోగా ప్రక్రియ పూర్తి చేయించాలని ఆర్డీవోలు, తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు, సీఎస్‌ఆర్‌ఐలుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు కీలకం కాబట్టి ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు రేషన్ సరకులతో పాటు భవిష్యత్తులో మిగిలిన అన్ని పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.రేషన్ కార్డు లబ్ధిదారుల్లో ఐదేళ్లు నిండిన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేయించుకోవల్సి ఉంది. ఐదేళ్లు దాటిన పిల్లల బయోమెట్రిక్ పడకపోతే ఆధార్ సెంటర్‌లో అప్‌డేట్ చేయించుకొని డీలర్ లాగిన్‌లో ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.
