సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజగా ప్రతిపాదించిన ‘రెసిప్రొకల్ టారిఫ్’ మరియు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే వారిపై చర్యలు తప్పవని చేసిన హెచ్చరికలతో భారత్ లో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచాయి. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఇటీవల కొద్దీ రోజులుగా కొంత కోలుకొంటున్నట్లు కనిపించిన భారత స్టాక్ మార్కెట్లు ఆర్థిక సంవత్సరం మొదటి రోజైన నేడు, మంగళవారం (ఏప్రిల్ 1, 2025) భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,390 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 23,200 కంటే దిగువకు చేరింది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ 737 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 442 పాయింట్లు పడిపోయింది. .దీంతో కొన్ని గంటల్లోనే మదుపర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆటో రంగం మినహా అన్ని ప్రధాన రంగాలు నష్టాల్లోనే ముగిశాయి.
