సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎండలు మండి పోతున్నాయి. వడగాలులు వీస్తున్నాయి. అయితే ఇంతలో చల్లటి కబురు వచ్చింది. తాజగా .. ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ తీరం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ కు ఇరువైపులా ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు, బుధవారం సాయంత్రం నుండి కోస్తా ఆంధ్ర , రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 3న రేపు గురువారం నుండి రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అక్కడక్కడా వడగళ్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. 4న రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో, కోస్తాలో కొన్నిచోట్ల వర్షాలు కురవనున్నాయి.
