సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2వారాలుగా దక్షిణ భరతావని అంతటా ఎండలతో జనం అవస్థలు పడుతుంటే గత గురువారం నుండి బంగఖాతం లోని సముద్రతీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని రాయలసీమ లో పలు ప్రాంతాలల్లో తెలంగాణలోని హైదరాబాద్ లో, తమిళనాడులో ఎక్కువ ప్రాంతాలలోను, కర్ణాటకలోని బెంగూళూరు, హోసూరు తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసాయి. ఎండవేడిమితో అల్లాడిపోయిన నగర ప్రజలకు అకాల వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భారీగానే కురిసింది. అయితే.. ఈ వర్షం వేసవి తాపాన్ని కొంత తగ్గించిందని చెప్పవచ్చు.
