సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉంగుటూరు నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ మరియు ఉండి నియోజకవర్గం లో సరిహద్దు గ్రామం ఆయన గణపవరం గ్రామంలో నేడు, గురువారం ‘రాజు వేగేశ్న ఫౌండేషన్ (ఇండియా)’ ఛైర్మన్ వేగేశ్న అనంత కోటిరాజు రూ. 35 కోట్ల ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలును శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు నిర్వహించారు. స్వగ్రామంలో అభివృద్ధి కోసం,ప్రజా సంక్షేమం కోసం దాత వేగేశ్న అనంత కోటిరాజు దాతృత్వాన్ని అభినందించారు.భారీ కేక్ ను కట్ చేసారు. ఈ కార్యక్రమాలలో వేగేశ్న అనంత కోటిరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పి ధర్మరాజు, కొత్తపల్లి నాగరాజు తదితర స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నేడు, గురువారం పోలీస్ అధికారులతో జరిగిన సమావేశం తదుపరి ఎమ్మెల్యే రఘురామా మీడియాతో మాట్లాడుతూ.. క్రైమ్ రహిత నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో, ముఖ్యంగా పాఠశాలలు, ఆలయ ప్రాంగణాలు మరియు కూడళ్లలో సుమారు వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశంపై పోలీసు వారితో కలిసి ప్రణాళిక రూపొందించామని ఈ సీసీ కెమెరాల ఏర్పాటు రెండు నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందని ప్రకటించారు.
