సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ తో సహా ఆసియా దేశాలలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణత కొనసాగుతోంది. ముఖ్యంగా భారత్, జపాన్, తైవాన్ సహా ఇతర ఆసియాలోని దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు, పరస్పర సుంకాల పెంపు వంటి అంశాలు స్టాక్ మార్కెట్ల ను ప్రతిరోజూ అతలాకుతలం చేస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున అమ్మకాలు జరిపారు. ఇక, భారత మార్కెట్ నేడు, సోమవారం ఉదయం తీవ్ర క్షీణతను ఎదుర్కొన్నాయి. నిఫ్టీ 5% తగ్గగా, BSE సెన్సెక్స్ 5.29% పడిపోయింది. అమెరికాలో S&P 500 7% లేదా 13% తగ్గితే, ట్రేడింగ్ 15 నిమిషాల పాటు నిలిపివేస్తారు.జపాన్ లో కూడా 10 నిమిషాల బ్రేక్ తో ట్రేడింగ్ నిర్వహింస్తున్నారు. మరింత క్షీణత ఉన్నప్పుడు, 20% తగ్గితే, మిగతా రోజు ట్రేడింగ్ ఆపివేయబడుతుంది.
