సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ నిధుల కంటే తన మిత్రులు, స్థానిక దాతలు సహకారంతో ఉండి లో పంటకాల్వల నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతు ‘తన రూటే సపరేట్’ అంటున్న రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, MLA రఘురామా కృష్ణంరాజు నేడు, బుధవారం ఆకివీడు మండలంలో మేజర్ పంచాయితీ అయిన దుంపగడప గ్రామంలో తన మిత్రుడు అవంతి ఫీడ్స్ ఇంద్ర కుమార్ దాతృత్వంతో పదహారు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 1.00 MLD మైక్రో ఫిల్టర్, మరియు దాదాపు కోటీ ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం, శ్రీ వరదరాజ స్వామి కళ్యాణ మండపం, 350 మీటర్ల సీసీ రోడ్లు, 250 మీటర్ల డ్రెయిన్ లను ప్రారంభించారు. . ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.ఉండి మార్కెట్ యార్డ్ లో ఈరోజు ఉదయం జరిగిన “ధాన్యం కొనుగోలు కేంద్రం” మరియు “వ్యవసాయ యాంత్రీకరణ” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజుపాల్గొన్నారు. అనంతరం “Sub-Mission on Agricultural Mechanization (SMAM)” పథకం క్రింద సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ పనిముట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
