సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్న ట్రంప్ సుంకాల కు 3నెలలు పాటు బ్రేక్ ఇవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా పుంజుకొన్నాయి. ( అయితే నిన్నభారత్ స్టాక్ మార్కెట్ సెలవు) భారత స్టాక్ మార్కెట్లు నేడు, (ఏప్రిల్ 11న) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మంచి జోష్ తో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు 1.5% చొప్పున పెరిగాయి. ఇదే సమయంలో నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,760 పరిధిలో ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 1140 పాయింట్ల లాభంతో 75,000 స్థాయిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ దాదాపు 700 పాయింట్లు పెరిగి 51,000 పరిధిలో నిలిచింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరుగగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 400 పాయింట్లు పుంజుకుంది. మార్కెట్ 92% బుల్లిష్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను రికవరీ చేసుకొన్నారు. ప్రస్తుతం సిప్లా, టాటా మోటార్స్, JSW స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, ఏసియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ సంస్థల స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఇటీవల డాలర్ బలహీనపడటంతో భారత్ రూపాయికి ఊపు వస్తుంది. బుధవారం ముగింపు స్థాయి అయిన రూ.86.69తో పోలిస్తే, రూపాయి ఈ ఉదయం 45 పైసల లాభంతో రూ.86.24 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. .
