సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ను నేటి శనివారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షలు రాసిన విద్యార్థులు resultsbie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సాప్ (Manamitra WhatsApp) నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలు చూడొచ్చని సూచించారు. ఫోన్‌లో రెండు నిముషాల్లో ఫలితాలు చూసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బెస్ట్ విషెస్ చెబుతూ.. ఇంటర్ ఫలితాలు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు మార్గం చూపుతాయని లోకేష్ పేర్కొన్నారు.
