సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో పచ్చని పంట భూములలో ఎలా రాజధాని నిర్మిస్తారు? అంటూ ఎన్ని వివాదాలు ఎదురయిన అమరావతి రాజధాని నిర్మాణం కోసం సుమారు 35 ఎకరాల భూమిని సేకరించిన చంద్రబాబు సర్కార్ తాజాగా మరో 30 వేలు భూ సమీకరణకు కసరత్తు చేస్తోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 5000 వేల ఎకరాల భూమి అవసరం అని అంచనా వేస్తుంది. దీంతో 20 వేల ఎకరాలు పూలింగ్ చేయాల్సిన పరిస్థితి ఉందని, .అలాగే, స్పోర్ట్స్ సిటీకి 2 వేల ఎకరాల అవసరం , ఇంకా స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ నిర్మా ణం కోసం మరో 2000 ఎకరాల భూమి అవసరం కాగా.. దాని కోసం 8000 ఎకరాల సమీకరణ చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సర్కార్ భావిస్తుంది. రైతులకు రిటర్న్ బుల్ ప్లాట్స్ ఇవ్వగా తక్కువ భూమి ప్రభుత్వం వద్ద మిగిలే అవకాశం ఉంది. మరి దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎవరు నష్టపోని రీతిలోనే భూసేకరణ జరుగుతుందని కూటమి ప్రభుత్వం పేర్కొంటుంది.
