సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సామాజిక పోరాటం – అణగారిన వర్గాల ఆశాకిరణం బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుఅన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో నేడు, సోమవారం డా బిఆర్ అంబేద్కరు 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే అంజిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి స్థానిక అంబెడ్కర్ కాంస్య విగ్రహం సెంటర్ కు వెళ్లి పూలమాలలు వేసి ( ఫై ఫొటోలో) అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్నిసాధించుకుందామని, దేశానికి అంబేద్కర్ సేవలు నిరుపమానమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు నేటికి కూడా ఎంతో ఆచరణీయమని నివాళులర్పించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు.
