సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం Dr B R అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా భీమవరం ప్రకాశం చౌక్ లో గల Dr BR అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి, మరియు గునుపూడిలోని కాంస్య విగ్రహాలకు ఏపీ శాసనమండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు పూల మాల వేసి నివాళులర్పించారు.భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన సేవలకు భారత జాతి రుణపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో YSRCP పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామ రాజు దళిత సంఘాల నాయకులు స్టాలిన్ వీరయ్య తాళ్లూరి మధు మాజీ కౌన్సిలర్ శ్రీ వాసర్ల ముత్యాల రావు తదితరులు పాల్గొన్నారు.
