సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న 248 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ తాజగా నేడు, సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వీరంత గత వైసీపీ ప్రభుత్వంలో నియమితులైనవారు కావడం గమనార్హం. ఏపీ ఫైబర్ నెట్ ఒక అవుట్ సోర్సింగ్ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేశారు. దీనితో ఒక్కసారిగా ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లో 248 మంది ఉద్యోగుల్ని తొలగించారు. తొలగించినవారిలోచాలామంది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఉద్యోగులు కూడా ఉన్నారు. చాలామంది వైజాగ్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ (NOC)లో పనిచేస్తున్నారు. అయితే వీరి తొలగింపుతో ఫైబర్ నెట్ కార్యకలాపాలు కు వినియోగదారుల సర్వీస్ లకు తీవ్ర ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. దాన్ని కొత్త ఉద్యోగులతో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
