సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి నేడు, మంగళవారం హీరో అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ వెంట ఆయన భార్య స్నేహ రెడ్డి కూడా ఉన్నారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసినట్లు సమాచారం. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నేపథ్యంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కూతురు పొలెనా అంజనా పవనోవాలను తనతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చేశారు పవన్ కల్యాణ్.
