సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో కూటమిప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న తిరుమల గోశాల లో గోవుల మరణాలు , వక్ఫ్ బిల్లు వంటి , పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలోనూ వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టాలని వైసీపీ చూస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.. ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కూటమి నేతలంతా అప్రమత్తంగా ఉండాలని, పాస్టర్ ప్రవీణ్ విషయంలో సహజ మరణమే అంటూ సాక్ష్యాలు చూపించినా ఇంకా కొందరు అది హత్య అంటూ బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. “మనం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు క్లియర్‍గా చెప్పి చేద్దాం. వక్ఫ్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో మనం క్లియర్‌గా ఉన్నాం. వక్ఫ్ బిల్లుపై వైసీపీ మూడు రకాలుగా వ్యవహరించింది. ఆ పార్టీ ఎంపీలు లోక్ సభలో వ్యతిరేకిస్తూ రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారు. మరోవైపు బయటకు వచ్చి వక్త్ బిల్లు అంశాలు సవరించాలనిమార్చాలని మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మే నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఉంటుంది. రాష్ట్రంలో కూటమి పాలన విషయంలో మేమంతా ఎక్కడా తప్పు చేయడం లేదు. కానీ ప్రజలలో అధికారుల అవినీతిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీన్ని వారు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వారిపై తగిన చర్యలు ఉంటాయి. జిల్లాస్థాయిల్లో రెవెన్యూ అంశాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని తెలిసింది. అందరూ జాగ్రత్తగా పని చేయాలని” పేర్కొన్నారు.
