సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గత మంగళవారం నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటిలో మొత్తం 24 అంశాలపై మంత్రులు చర్చించారు.. వాటిలో కొన్నింటికి ఆమోద ముద్ర వేశారు. వీటిలో కీలకమైనది .. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ జరిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కుఎపి మంత్రి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.అలాగే రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరదల నివారణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
