సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, ఆదివారం దర్శించుకున్న రాజమండ్రికి చెందిన భక్తులు వానపల్లి కుశ్వoత్ 385 గ్రాముల అష్టలక్ష్మీల అలంకారంతో తయారు చేసిన వెండి చెంబు కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదాలు శేషవస్త్రం అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
