సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పేద ముస్లింలకు న్యాయం జరగాలనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తీసుకురావడం జరిగిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నేడు, ఆదివారం బిజెపి నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్ర బిజెపి ముద్రించిన వక్ఫ్ సవరణ చట్టం ప్రయోజనాలను తెలియజెప్పే కరపత్రాలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి ఇతర బిజెపి నేతలకు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 20వేల కరపత్రాలను అన్ని మండలాల అధ్యక్షులకు అందజేస్తామని, ముస్లింలలో వక్ఫ్ సవరణ చట్టం పై ఉన్న సందేహాలు తొలగిపోయేలా అన్ని వివరంగా ఈ కరపత్రంలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం తూర్పు అధ్యక్షులు అడబాల శివ, భీమవరం పడమర అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాద్, షేక్ మొహద్దీన్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గోవర్ధన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
