సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం భారత స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగు కొనసాగించింది. దీంతో వరుసగా ఐదు సెషన్లలో భారత మార్కెట్ సూచీలు లాభాలతో ముగిసినట్టైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 855.30 పాయింట్లు లేదా 1.09 శాతం పెరిగి 79,408.50 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 273.90 పాయింట్లు లేదా 1.15 శాతం పెరిగి 24,125.55 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ సెషన్లో కూడా భారీగా పెరిగింది. 1,014.30 పాయింట్లు లేదా 1.87 శాతం పెరిగి 55,304.50 దగ్గర నిలకడగా ఉంది. స్థిరపడింది.మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 2.50 శాతం, 2.21 శాతం లాభాలతో ముగిశాయి.మొత్తంగా నేడు, 91 స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి.బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, ఐషర్ మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇంకా శ్రీ సిమెంట్ లాభాల్లో ముగిశాయి. నేటి మార్కెట్ల పెరుగుదల ఫిబ్రవరి 2021 తర్వాత అంతటి స్థాయిలో ఐదు రోజుల ర్యాలీని సూచిస్తుంది.
