సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎండలు బాగా మండి పోతున్నాయి. మరో ప్రక్క పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు నేటి గురువారం నుండి వేసవి సెలవులు ప్రారంభము అయ్యాయి. అయితే జూన్ 2వ తేదీన జూనియర్ కాలేజీలు , జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని ప్రభుత్వ విద్యాశాఖ ప్రకటించింది. అయితే పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం జూన్ 6వ తేదీ నుండి అడ్మిషన్స్ నేపథ్యంలో తమ విధులు నిర్వర్తించడానికి జాయిన్ కావాలని ప్రభుత్వం ఆదేశించింది.
