సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, గురువారం ఉదయం సచివాలయానికి వచ్చిన తదుపరి..అక్కడ 11.30 నుంచి 1.30 గంటల వరకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ & మిషన్ లెర్నింగ్‌పై వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇకపై విద్యార్థుల భవిషత్తు మన రాష్ట్ర అభివృద్ధి లో ఏ ఐ ప్రధాన పాత్ర పోషిస్తుందని,వెనుకబడిన విద్యార్థులలో స్కిల్స్ పెంచుతుందని, ఏ ఐ సహకారంతో తో వారు ఎవరికీ తీసిపోరని ముందుంటారని అన్నారు. దీనికోసం ప్రోత్సహకాలు ఉంటాయని అన్నారు. ఇక రేపు(శుక్రవారం) ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అవనున్నారు. మే 2వ తేదీన ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్న సమయంలో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రేపు రాత్రికి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేస్తారు. ఎల్లుండి(శనివారం) ఉదయం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నానికి చేరుకుంటారు.
