సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్న ఏపీ డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేడు, గురువారం అమరావతి లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సభ నేపథ్యంలో సికె కన్వెన్షన్ హాల్ కు హాజరు కావడం జరిగింది. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, మౌలిక వసతుల కల్పన వంటి పురోగతిని పవన్‌కు అధికారులు వివరించారు. అంతకుముందు కార్యక్రమంలో పహెల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్భంగా తాను పంచాయతీ రాజ్ శాఖను ఇష్టంగా ఎంచుకున్నానని,తాను నగరాల్లో ఉన్నా.. పల్లెల్లో ఉండాలనే కోరిక ఉండేదని పవన్ అన్నారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకం అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని చెప్పానని.. అలాగే అమలు చేస్తున్నానని అన్నారు. ఈ అభివృద్ధి పనులకోసం కాంట్రాక్టర్స్ తమ ఇంట్లో నగలు తాకట్టు పెట్టి పనులు చేశారని, నిధులు రావడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. దీని వల్ల కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వలేక పోయామన్నారు.త్వరలో నిధులు వస్తాయని… అందరికీ బిల్లులు చెల్లిస్తామని పవన్ కల్యాణ్ భరోసా ఇస్తున్నామన్నారు. తాను నిబంధనల ప్రకారం వెళతానని కొన్ని గ్రామాలు వర్గ పోరు, కులాలపోరు వల్ల నష్టపోయాయని, కూటమికి చెందిన సర్పంచ్‌లు లేకపోయినా ఎక్కువ మంది వైసీపీ కి చెందినవారే ఉన్నారని.. అయిన్నప్పటికీ .. మేము ప్రజలకోసం ఆలోచన చేశామన్నారు. పంచాయతీ సర్పంచ్, ఎంపిటిసి, జడ్పీటీసీ, ఎంపిపిలకు ఇచ్చే మర్యాద, గౌరవం ఇచ్చామని అన్నారు.గత ప్రభుత్వం నిధులు మళ్లించింది అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక పంచాయతీల అభివృద్ధికి రూ. 1120 కోట్లు వినియోగించామని పవన్ చెప్పారు.
