సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విద్యార్థులకు వేసవి సెలవుల నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో టీటీడీ వీఐపీ, MP,MLA, MLC సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తాజగా .. టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రకటించారు.మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫారసు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు” ఆయన ప్రకటించారు. అంటే, ఈ రెండు నెలల పాటు ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉండవు అని భక్తులు గమనించాలి.
