సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి సమీపంలోని చంద్రగిరి వద్ద నేడు, సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప రెడ్డి పల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తమినాడు కు చెందిన ఒక వృద్దురాలు తో సహా ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కంటైనర్ నుండి అతి కష్టం మీద కారును బయటకు లాగి గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
