సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన సీనియర్ బీజేపీ నేత పాక సత్యనారాయణ నేడు, మంగళవారం విజయవాడలో మధ్యాహ్నం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ , రాష్ట్రంలో బీజేపీ మంత్రి. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు వెంటరాగా, ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో తన రాజ్యసభ సభ్యత్వ ఎన్నికకు నామినేషన్ సమర్పించారు. ( ఎలానూ రాష్ట్రంలో కూటమి రాజ్యసభ అభ్యర్థిగా పాక ఎన్నిక లాంఛనమే..) ఈ సందర్భముగా ఆయనను కూటమి నేతలు ప్రజా ప్రతినిధులు అభినందించారు. తదుపరి సీఎం చంద్రబాబు ను పాక సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలవడం ఆయన పాకకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. భీమవరం పట్టణములో ఎక్కడ చుసిన ‘పాక’ కు బీజేపీ నేతల అబినందన్ ఫ్లెక్సీ లతో పండుగ వాతావరణం కనపడుతుంది.
