సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసంఘటిత రంగ కార్మికులు హక్కుల పరిరక్షణకు చాలా చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని, హక్కులకు భంగం కలిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటారని” భీమవరం 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) శ్రీమతి P.హనీష అన్నారు. ఈనెల 1నుండి 7వరకూ అసంఘటిత కార్మికులకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా భీమవరం U.T.F. భవనంలో నేడు, సోమవారం అసంఘటిత రంగ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి కనీస వేతన చట్టం, ఆరోగ్య భద్రత, సంక్షేమ పధకాలపై గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు B.సురేష్ కుమార్, N.సుధీర్, P.అంబేద్కర్, K.జ్యోతి, CITU జిల్లా ఉపాధ్యక్షులు మరియు పట్టణ కార్యదర్శి B.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
