సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏఐటీయూసీ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా నేడు సోమవారం సిపిఐ నాయకులు భీమవరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అడ్జక్షుడు కోనాల మాట్లాడుతూ.. ప్రస్తుతం నిత్యావసర సరుకులు ఆకాశంలో దూసుకుపోతున్నాయని, చిన్న కుటుంబం గడవాలంటే కనీసంలో కనీసం నెలకు 35 వేల రూపాయలు పైబడిన మాటని ఇదే విషయం డాక్టర్ ఆక్టాయిడ్ కమిటీ అధ్యయనం చేసిందని ఆప్రకారం కనీస వేతనం ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిందని కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ నెలకు 35 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కలిశెట్టి వెంకట్రావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకుడు ఎం.సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
