సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క దాయాది పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేస్తుంటే.. మరో ప్రక్క దేశంలోని తెలంగాణ- ఛతీస్ ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం ఉదయం భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. అని అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే మృతుల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఘటనా స్థలంలో కాల్పులు కొనసాగుతున్నాయి. నమ్మిన సిద్ధాంతం కోసం ఇంతమంది చనిపోవడం చాల బాధకర విషయం అయినప్పటికీ. జనజీవ స్రవంతి లో కలవడానికి ఇష్టపడని నక్సల్స్ ను ఏరివేయాలన్న లక్ష్యంతో..ఈ ఆపరేషన్ను డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీ ఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సీఏఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
