సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాక్ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో సుమారు 100 కు పైగా సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. అయితే,తేలుకుట్టిన దొంగల ఉగ్రవాదుల తండాలలో మరణించిన వారి క్లిపింగ్స్ వీడియోలు అన్ని బయటకు రాకుండా పాక్ జాగ్రత్త పడింది. అయితే ఈ దాడుల్లో భారత్ లో పలు అరాచకాలు, విమానం హైజాక్ వంటి ఘటనలతో అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరొందిన జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబసభ్యులు కూడా మరణించినట్టు ఆయన స్వయంగా రాసిన లేఖ దుర్వా తాజాగా వెలుగులోకి వచ్చింది. బహావల్‌పూర్‌లో జరిగిన దాడిలో మజూర్ సోదరితో పాటు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించిన మరో బంధువుతో సహా మొత్తం 10 మంది కుటుంబసభ్యులు బాంబు ధాటికి మరణించారు.. కర్మ ఎవరిని వదలదు.. అన్నది ఈ ఉదంతం నిజం చేసింది. తన ఉగ్రవాద చర్యలతో ఎందరో భారతీయ కుటుంబాల ఉసురు తీసిన అజర్ మసూద్.. తన లేఖలో.. భారత్ జరిపిన మిసైల్ దాడిలో కుటుంబాన్ని కోల్పోయానని, తాను కూడా చనిపోయి ఉంటె ఇంత బాధ పడీ ఉండేవాడిని కాదని పేర్కొన్నాడు. భారత్ ఫై తన కక్ష ఇంకా పెరిగిందని ఇక జాలి దయ లేదని ప్రతీకారం తీర్చుకొంటానని తనదయిన హెచ్చరికలు చేసాడు. దీనితో ప్రపంచం ఉగ్రవాద మూకలను పాకిస్తాన్ లో ఏరివేయడం తో భారత్ సరైన నిర్ణయం తీసుకొంది అని ప్రశంసిస్తుంది.
