సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ – పాక్ దేశాల యుద్ధం తీవ్ర స్థాయికి చేరిన నేపాయంలో గత వారాంతం శుక్రవారం భారీ నష్టాలు చవిచూసిన భారత స్టాక్ మార్కెట్ (Stock Market) ప్రస్తుతం యుద్ధం నిలిపివేత నేపథ్యంలో నేడు, సోమవారం మే 12, 2025న భారీ లాభాలతో దూసుకెళ్లింది. ఈ క్రమంలో సెన్సెక్స్ ఒక్క రోజులోనే 2975 పాయింట్లు జంప్ చేసి 82,429.54 వద్ద ముగిసింది. ఇది 3.74% వృద్ధిని సూచిస్తుంది. ఇదే సమయంలో నిఫ్టీ 50 కూడా 872.9 పాయింట్లు లేదా 3.66% పెరిగి 24,830.75 వద్ద స్థిరపడింది. ఈ భారీ లాభాలు దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మదుపర్లకు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. ఇటీవల అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒత్తిడి కూడా తగ్గడం, మార్కెట్‌ను మరింత ఉత్తేజపరిచాయి
