సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వద్ద నేడు, బుధవారం నుండి ఏర్పాటు చేసిన మజ్జిగ చలి వేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. రావాడ రామ్మోహన్ రావు, వరలక్ష్మి దంపతులు దాతృత్వంతో మజ్జిగ చలి వేంద్రాన్ని దేవస్థానం వారు ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, కోళ్ల నాగేశ్వరరావు, ఆలయ మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణ మూర్తి , ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
