సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం తో పాటు పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా ఈ వేసవి సీజన్ లోనే రికార్డు స్థాయిలో నేటి గురువారం ఉదయం నుండి తీవ్ర ఉక్కబోత అటు ఫై ప్రచండ ఎండలు అంతలోనే మబ్బులు వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉత్తరకోస్తాలో క్యుములోనింబస్ మేఘాలు ఆవరించాయి. ఈ ప్రభావంతో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. మామిడి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లాలోపలు ప్రాంతాలతో పాటు ఏలూరులోనూ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది.గత బుధవారం అయితే ఏలూరు అర్బన్ ప్రాంతంలో 79.4, ఏలూరు రూరల్ మండలంలో 55.4, పూళ్లలో 44.5, ఏలూరులో 34.5, వర్షం భారీగా కురిసింది. ఉత్తరాంధ్ర లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలుఆపసోపాలు పడుతున్నారు.అనంతపురంలో భారీ వర్షాలు పడుతున్నాయి.
