సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి డెల్టా ప్రాంతాన్నికి పంటకాలువల ద్వారా గోదావరి నది జలాలను మళ్లించి సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు “సర్ ఆర్థర్ కాటన్” గారి జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆ మహనీయుని కాంస్య విగ్రహలకు వాడవాడలా పుష్ప మాలలతో అంజలి ఘటించారు. భీమవరంలోని జేపీ రోడ్డు లో కాటన్ పార్క్ వద్ద, భీమవరం హోల్ సేల్ ఫిష్ మార్కెట్ వద్ద భారీ కాటన్ దొర విగ్రహాలకు ఇరిగేషన్ ఉద్యొగులు, రైతులు పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ నేపథ్యంలో పెదమిరంలోని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు నేడు, గురువారం తన కార్యాలయంలో కాటన్ మహాశయుని సేవలను ప్రశంసిస్తూ వారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
