సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం, జక్కరం గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నేడు, గురువారం జరిగిన ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే .పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కుకు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు కూటమి నేతలు పాల్గొనారు.
