సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి వివరాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన గెడ్డం రామరాజు, తణుకుకు చెందిన వారాడ సుధీర్, పోలవరానికి చెందిన హేక్ హజరత్ అలీ రాజమహేంద్రవరంలోని అపోలో ఫార్మసీ ఉద్యోగులు. మృతి చెందారు. వీరి సహా ఉద్యోగులు రాజమహేంద్రవరానికి చెందిన వెంకట సుబ్బారావు, కాకినాడ జిల్లాకొవ్వాడకు చెందిన గోనా శివశంకర్ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నంలో జరిగిన అపోలో ఫార్మసీ కంపెనీ సమావేశానికి హాజరై గత రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కాకినాడ జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ఇసుప కడ్డీల లోడు లారీని బలంగా ఢీకొట్టింది. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేయడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పోలీసులు అక్కడకు చేరుకుని కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
