సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పవిత్ర పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం లో దూరప్రాంత భక్తుల కోసం ప్రతి నిత్యం జరిగే అన్నసమారాధన నిర్వహించే నిత్య అన్నదాన ట్రస్టు నకు భీమవరం వాస్తవ్యులు నామన విజయ రామ మోహన్, సుజా నాగ వెంకట శ్రీదేవి దంపతులు రూ.50,558/-లు మరియు మండెల రామాంజనేయులు, బేబి సరోజని దంపతులు రూ.50,558/-లు శాశ్వత అన్నదానం పధకం నిమిత్తం కానుకలుగా సమర్పించారని కార్యనిర్వహణాధికారి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
