సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. నేడు, మంగళవారం తెల్లవారు జామునుండి భీమవరంలో భారీ వర్షాలు పడుతున్నాయ్. నేటి మధ్యాహనానికి కూడా పట్టణం అంత మేఘావృతం అయ్యి చిరు చినుకులు పడుతూనే ఉన్నాయి. మరో పక్క తీవ్రమైన ఉక్కపోత తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. రేపు ఎల్లుండి కూడా ఇదే రీతిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక విజయవాడలో నేడు, ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నాయి.వర్షాలకు తుంగభద్రలో నీటి ప్రవాహం పెరిగింది.వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విషాదాలు చోటు చేసుకొన్నాయి.. శ్రీకాకుళం నగరంలో నాగావళి నదీ తీరంలో తండ్రీ కొడుకులు పిడుగుపాటుకు గురయ్యారు. పిడుగుపాటుకు గురైన తండ్రి గేదెల రాజారావు మృతి చెందగా.. కుమారుడు గేదెల నాగార్జునకు తీవ్ర గాయాలయ్యాయి. అటు కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఈదుకుంటూ సురక్షితంగా హోప్ ఐలాండ్ చేరుకోగా.. మెరుగు శ్యామ్(20) అనే యువకుడు గల్లంతయ్యాడు.
