సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్టాక్ మార్కెట్లు సూచీలు నేడు బుధవారం (మే 21, 2025) లాభాలతో దూసుకొనిపోతున్నాయి. గత మంగళవారం ఇన్వెస్టర్స్ ను భారీ నష్టాలలో ముంచేసిన స్టాక్స్ నేడు కొంత నష్టాలను రికవరి చేస్తున్నాయ్. నేటి ఉదయం 11 గంటల నాటికి BSE సెన్సెక్స్ 800 పాయింట్లు పైగా లాభపడగా, NSE నిఫ్టీ 265 పాయింట్లు ఎకబాకింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 457పాయింట్లు వృద్ధి చెందగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం 532 పాయింట్లు పైకి చేరింది. మరికొంత మంది ఇన్వెస్టర్లు మాత్రం నష్టపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ ఎలక్ట్రికల్స్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, సిప్లా, ఎం అండ్ ఎం కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో కొనసాగుతున్నాయి.
