సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చాల కాలంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై నేడు, బుధవారం ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్, సోనియాలు నేరానికి పాల్పడి రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని నేడు బుధవారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది. నేరాల ద్వారా వచ్చిన డబ్బును సంపాదించి, దాచుకున్నారని ఈడీ తీవ్రమైన ఆరోపణులు చేస్తోంది. ( ఈ కేసులో రాహుల్ సోనియాల అరెస్ట్ తప్పదని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి) కాగా గత మే 2న, కోర్టు గాంధీ కుటుంబంతో పాటు సుమన్ దూబే, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్, సునీల్ భండారీలకు నోటీసులు జారీ చేసింది. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి విదేశీ నిధులతో ఈ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. అయితే సీబీఐ విచారణను మధ్యలోనే మందగించినప్పటికీ .. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగిస్తుండటం గమనార్హం.
