సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు, గురువారం ప్రెస్‌మీట్ లో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా మోసాలతో నడిచిందన్నారు. దేశంలో 13 శాతం అభివృద్ధి కనిపిస్తే మన రాష్ట్రంలో 3.8శాతం మాత్రమే గ్రోత్ కనిపిస్తోందన్నారు. కరెంట్ రేట్లు పెంచారు. ప్రజలకు రైతులకు ఉన్న సంక్షేమ పధకాలు తీసివేశారు. ఏడాది పాలనతో ప్రజల కొనుగోలు శక్తి, తగ్గిందని ఏది కొనలేక పోతున్నారని అన్నారు. తమ పాలనలో చివరి ఏడాది రూ.67వేల కోట్ల అప్పులు చేశామని, చంద్రబాబు ఏడాది పాలనలో 1లక్ష 37 వేల కోట్లు అప్పులు తెచ్చిన అప్పుల సామ్రాట్ చంద్రబాబేనని, ఇందులో ప్రజల సంక్షేమానికి ఇచ్చింది ఏమి లేదని, అమరావతి రాజధాని పేరుతొ దోపిడీ చేసి దాచుకోవడమే నని ఆరోపించారు. రాష్ట్రంలో రూపాయి ఇడ్లి వస్తుందో రాదో తెలియదు కానీ రూపాయి కె ఎకరం భూమి చప్పున తమ బినామిలతో విశాఖలో 2వేల కోట్లు విలువైన భూములు కబ్జా చేసేస్తున్నారని ఆరోపించారు. ఎన్నోఅవినీతి కేసులలో నిందితుడుగా చంద్రబాబు ఉన్నారు. గతంలో లిక్కర్ స్కాం చంద్రబాబు హయాంలో జరిగినట్లు కేసు ఉంది. మరి చంద్రబాబు బెయిల్ మీద లేరా ? అని ప్రశ్నించారు. గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4 తేదీ నుండి ప్రజలను మోసపూరిత వాగ్దానాలతో మాయ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఫై నిరసనగా ఈ జూన్ నెల 4న వెన్నుపోటు దినం ను రాష్ట్ర వైసీపీ శ్రేణులు ప్రజలతో కలసి నిర్వహిస్తామని ప్రకటించారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ బియ్యం ఎగుమతులపై హడావిడి చేసి ” సీజ్ ది షిప్” అన్నారు. మరి ‘షిప్ లేదు.. బియ్యం లేదు.. కేసు లేదు’.. అని సెటైర్ వేశారు. ఆఖరికి తమ విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు కు అమ్ముడుపోయాడని జగన్ విమర్శించారు.
