సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025 వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం పవన్ మాట్లాడుతూ.. అందరికీ ప్రకృతి నుంచీ తీసుకోవడమే కానీ ప్రకృతిని రక్షించడం అలవాటు లేకుండా పోయిందన్నారు. కానీ ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటామని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. తన 8 ఎకరాల పొలంలో దున్నడం మానేసి, అక్కడ సహజంగా పెరిగే మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు .సహజంగా ఏర్పడిన మడ అడవులు సముద్రం దగ్గర ఉంటూ మనలని రక్షిస్తాయన్నారు.అయితే, ఇటీవల మడ అడవులను కూడా నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.తూర్పు కనుమలలో శేషాచలం, నల్లమల, పాపికొండలు మనకు ఇంకా ఉన్నాయని, ప్రతీ జిల్లాలో ఒక బయో డైవర్సిటీ పార్క్ ని ఏర్పాటు చేస్తామన్నారు. రాజమండ్రి దగ్గర కడియం నర్సరీలు కోనాకార్పస్ అమ్మకాలు ఆపడం గురించి ఆలోచించాలన్నారు. పక్షులు కూడా ఉండలేని మొక్కలను ఎలా అమ్ముతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
