సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జాతీయ రహదారిపై భీమడోలు వద్ద డివైడర్ తరుచు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఐదు నెలల్లో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. 31 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు రికార్డ్స్ చెబుతున్నాయి. మరి అనధికారకంగా ఎందరో?. గత మంగళవారం అర్ధరాత్రి మూడు ట్రావెల్స్ బస్సులు వరుసగా ఒక దానివెనుక ఒకటి వచ్చి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు బస్సు లు కలపి 140 మంది ప్రయాణికులు ఉండగా వారిలో హైదరాబాద్‌లో చిన్న ద్యోగాలు చేసుకుంటున్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై బస్టాండ్ సమీపంలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఏలూరు–కొవ్వూరు జాతీయ రహదారి, ఏలూరు–తాడేపల్లి గూడెం జాతీయ రహదారిపై డివైడర్ల సమీపంలో తరచూ ప్రమాదాలు నివారణకు అధికారులు, పోలీసులు శ్రద్ద పెట్టవలసి ఉంది. భీమడోలు కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో డివైడర్, అయ్యప్పస్వామి ఆలయం, కురెళ్లగూడెం, పూళ్ల, పి.కన్నాపురం రైల్వే గేటు, ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు లో రోడ్లు రక్తం ఒడుతున్నాయి. file photo
