సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరల నష్టాల్లో ముగిశాయి. ఇటీవల వరుస నష్టాల తర్వాత నిన్న కాస్త లాభాలు చవిచూసిన సూచీలు.. నేడు గురువారం మరోసారి నష్టాలrలో ముంచాయి. ప్రపంచంలో అత్యధిక అప్పులు చేస్తున్న అమెరికా అప్పులపై ఆందోళన, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మన మార్కె ట్ సూచీలు నష్టాలు మూటగట్టాయి. సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 24,500 పాయిం ట్ల దిగువకు చేరింది. కాస్త ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కాస్త పైకి లేచాయి. సెన్సెక్స్ ఉదయం 81,323.05 పాయింట్ల వద్ద (క్రితం ముగిం పు 81,596.63) నష్టాల్లో ప్రారంభమైంది.ఆఖరికి 80,951.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 203.75 పాయింట్ల నష్టంతో 24,609.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 42 పైసలు క్షీణించి 86.01గా ఉంది.
