సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, గురువారం ఉదయం నుండి హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని మారుతీసెంటర్, సుంకరపద్దయ్య వీధిలోని 30 అడుగుల విగ్రహం గుడి వద్ద 108 కలశాలపాలతో స్వామిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొన్నారు. పెదమిరం లోని స్వర్ణ సాయి మందిరం వద్ద హనుమను లక్ష తమలపాకుల పూజ ఉద్దరాజు రాఘవరాజు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.(ఫై ఫొటోలో) గురువారం కావడంతో ప్రక్కన శ్రీ బాబావారి భక్తుల అన్నసమారాధన కూడా ఘనంగా జరిగింది. శ్రీ రామాపురం పాత అర్బన్ బ్యాంకు వద్ద, రాయలం లోని 20 అడుగుల హనుమాన్ విగ్రహం గుడి వద్ద, అన్ని రామాలయాల వద్ద కేసరి నందన పూజలు, పుష్ప అలంకారాలతో పందిళ్ళతో భక్తులతో సందడిగా మారాయి. పలు దేవాలయాల వద్ద అన్నసమారాధన లు ఏర్పటు చేసారు నందమూరు గురువు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ క్యూ లైన్ ల భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జై !శ్రీరామ్
