సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా సమితి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో అమాయక ఆదివాసీ గిరిజనులను ఊచకోత కోస్తున్నారని, నక్సలైట్లు పేరుతో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం దారుణమని విమర్శించారు. మన ఏపీలో .సిపిఐ గత ఎనిమిది నెలలుగా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ అర్జీలు అధికారులకు సమర్పించడం జరుగుతుందన్నారు.తక్షణమే పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 న తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించ నున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు రావడంలేని ధాన్యానికి పదిహేను వందలు అటుఇటుగా ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా 27 వ జిల్లా మహాసభలు ఆగస్టు 6,7వ తేదీల్లో ఉండిలోనిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పహల్గాం లో టెర్రరిస్టు దాడుల మృతులకు, ఆపరేషన్ సింధూరలో మృతి చెందిన భారత సైనికులు,పౌరులకు సంతాపం పాటించారు.ఈ సమావేశంలో సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, నెక్కంటి సుబ్బారావు, చెల్లబోయిన రంగారావు, తదితరులు పాల్గొన్నారు.
