సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నేడు, గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. వంటకాల నాణ్యతను, రోజుకు ఎంతమందికి పెడుతున్నారు?పరిశుభ్రత వంటి విషయాలపై ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తో మాట్లాడారు. అదే విధంగా దేవస్థానం ఎదురు రోడ్డులో ఎటువంటి భారీ వాహనాలకు అనుమతి లేకుండా చూడాలని, 4 వీలర్స్ ను అనుమతించకూడదని ,కేవలం ద్వి చక్ర వాహనాలకే అనుమతి ఇచ్చి ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా చూడాలని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ లకు ఆదేశాలు ఇచ్చారు.
