సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ నిలకడలేని తిక్క చేష్టలతో విసిగిపోతున్న.. యూరప్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా నెదర్లాండ్స్‌లో మంత్రి జై శంకర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్ దాడులతో తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ బుద్ధి మార్చుకోకుండా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లోనే ఐక్యరాజ్యసమితి గుర్తించి విడుదల చేసిన ఉగ్రవాదులంతా ఉన్నారన్నారు. వారంతా పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తున్నారని గుర్తు చేశారు. అక్కడి నుంచే వారు ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వారి చిరునామాలే కాదు.. ఎవరెవరితో వారు సంబంధాలు నెరుపుతున్నారో కూడా పాక్ ప్రభుత్వానికి, ఆర్మీ అధికారులకు తెలుసునని వివరించారు. అంతేకాదు వారంతా పట్ట పగలు పాకిస్థాన్‌లో రోడ్ల ఫై బహిరంగంగా తిరుగుతున్నారంటూ .. జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక రంగాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భారత్, పాకిస్థాన్‌ల మధ్య అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని భారత్ తొసిపుచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాశ్మీర్ అంశంలో మూడో ప్రమేయాన్ని తాము అంగీకరించబోమని మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు.
