సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2019లో ప్రారంభమైన కరోనా వ్యాప్తి సుమారు 3 ఏళ్ళు పాటు ప్రపంచంలోని అన్ని దేశాలను గడగడలాడించింది. మరల కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తుంది. కొద్దిరోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో 260 మంది కరోనా లక్షాణాలతో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. వారిలో అధికంగా కేరళ రాష్ట్రంలో 95 మంది, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56 మంది, ఉన్నట్లు కేంద్ర వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది . తాజగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడాకరోనా కలకలం రేపుతోంది. నేడు, శుక్రవారం విశాఖ పట్నం కు చెందిన ఓ వివాహిత మహిళకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. కడప జిల్లాలో మరో 2 కేసులు నమోదు అయినట్లు సమాచారం అందింది. దీంతో కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రర్తలపై జనాలు గ్రూపులుగా ఎక్కువగా తిరగొద్దని పేర్కొంటూ.. ప్రజలు మాస్క్ లు ధరించాలని జ్వరం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులతో బాధపడేవారు ఆసుపత్రులకు వెళ్లాలని ఏపీ వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది
